కూతురు న్యాయవాదిగా ఎదగడం సంతోషంగా ఉంది.

తల్లిదండ్రుల భావోద్వేగం

కూతురు న్యాయవాదిగా ఎదగడం సంతోషంగా ఉంది.

పెద్దమందడి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

తమ కుమార్తె ముప్పూరి నిహారిక పట్టుదలతో చదివి న్యాయవాదిగా ఎదగడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని వనపర్తి జిల్లా పెద్దమందూరు మండలం  మణిగిల్ల గ్రామానికి చెందిన ముప్పూరి సురేష్, అరుణ దంపతులు భావోద్వేగం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి చూపిన నిహారికను ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తాము ఎన్నో కష్టాలు పడుతూ ప్రోత్సహించామని తెలిపారు. తమ కష్టానికి తగిన ఫలితంగా నిహారిక న్యాయవిద్యలో  నిలవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. హైదరాబాద్‌లో న్యాయవాద విద్యను అభ్యసించిన నిహారిక, హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తన పేరును నమోదు చేసుకుని, అనంతరం వనపర్తి కోర్టులో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టిందని తెలిపారు. కూతురు ఈ స్థాయికి చేరుకోవడం తమ జీవితంలో మరిచిపోలేని సందర్భమని, ఆమె విజయం వెనుక తమ ప్రోత్సాహంతో పాటు బాబాయ్, ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పురుషోత్తం అందించిన మార్గదర్శనం కూడా ఎంతో ఉందని పేర్కొన్నారు. నిహారిక చిన్ననాటి నుంచి చదువు కోసం పడిన కష్టాలు, లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలు గుర్తుకొస్తుంటే ఆనందంతో మనసు నిండిపోతోందని అన్నారు. ఆడపిల్లలకు మంచి విద్య అందించి ప్రోత్సహిస్తే వారు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, తమ కుమార్తె విజయం ఇందుకు నిదర్శనమని సురేష్, అరుణ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. నిహారిక భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, పేదలకు న్యాయం అందించే మంచి న్యాయవాదిగా పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన. చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన.
చర్లపల్లి,నవంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు): స్వామి రాందేవ్ బాబా ఆశీస్సులతో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హరినాథరావు గురూజీ సారథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని...
హనుమకొండ జిల్లాలో విజయవంతమైన పల్స్‌ పోలియో .
నేతాజీ నగర్, శివశక్తి వాసులతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలి.