చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన.
ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో కొనసాగుతున్న యోగా తరగతులు..
చర్లపల్లి,నవంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు):
స్వామి రాందేవ్ బాబా ఆశీస్సులతో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హరినాథరావు గురూజీ సారథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిబిరం రెండో రోజు విజయవంతంగా కొనసాగింది. శిబిరానికి సాధకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. అనుభవజ్ఞులైన యోగా గురువులు యోగా శిక్షకుల బృందం యోగ గురువు టి రామ్ శెట్టి, యువ ప్రబారి యోగ గురువు బలరాం రెడ్డి, సహ ప్రబారి యోగ గురువు వీరేశం పాల్గొని పలువురికి యోగాసనాలు, ప్రాణాయామంపై శిక్షణ అందిస్తున్నారు. స్థానిక నాయకులు, అధికారుల నుంచి కూడా శిబిరానికి ప్రశంసలు లభించాయి. ఈ ఉచిత యోగా తరగతులు మరో ఏడు రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. ఆసక్తి కలిగిన స్త్రీ, పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ సెక్రటరీ పుప్పాల లక్ష్మీకాంతయ్య పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.


Comments