నేతాజీ నగర్, శివశక్తి వాసులతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.
Views: 0
On
కాప్రా,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
కాప్రా సర్కిల్ పరిధిచర్లపల్లి డివిజన్ లోని నేతాజీ నగర్,శివసాయి నగర్ కాలనీ పెద్దలు ఈగ యాదగిరి నివాసంలో కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కాలనీలోనీ సమస్యలపై జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎల్లవేళల కాలనీ అభివృద్ధికి కృషి చేస్తూ, తమ సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు కాలనీ ప్రజలు,నాయకులు మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, మహిళల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Nov 2026 20:35:25
చర్లపల్లి,నవంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు):
స్వామి రాందేవ్ బాబా ఆశీస్సులతో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హరినాథరావు గురూజీ సారథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని...


Comments