పట్టుదలతో చదివి న్యాయవాదిగా ఎదిగిన ముప్పూరి నిహారిక.

పట్టుదలతో చదివి న్యాయవాదిగా ఎదిగిన ముప్పూరి నిహారిక.

పెద్దమందడి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

పట్టుదల, కష్టపడే తత్వం, చదువుపై ఆసక్తి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన ముప్పూరి సురేష్, అరుణ దంపతుల కుమార్తె ముప్పూరి నిహారిక. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె కష్టపడి చదివి న్యాయవాదిగా ఎదిగి తన గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు.నిహారిక హైదరాబాద్ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తన పేరును నమోదు చేసుకుని వనపర్తి కోర్టులో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు.చదువుకునే సమయంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, లక్ష్యంపై దృష్టి సారించి న్యాయవిద్యను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు ముప్పూరి సురేష్, అరుణ అందించిన ప్రోత్సాహంతో పాటు ఆమె బాబాయ్, ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పురుషోత్తం అందించిన ప్రోత్సాహం, మార్గదర్శనం కూడా నిహారిక విజయానికి తోడ్పడ్డాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారంతోనే న్యాయవాదిగా తన లక్ష్యాన్ని చేరుకోగలిగానని నిహారిక సంతోషం వ్యక్తం చేశారు.మణిగిల్ల గ్రామానికి చెందిన యువతి న్యాయవాదిగా ఎదిగి వనపర్తి కోర్టులో బాధ్యతలు చేపట్టడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిహారిక విజయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులకు స్ఫూర్తిగా నిలుస్తూ, పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చనే సందేశాన్ని ఇస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

చీకటోనిపల్లిలో గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమిపూజ. చీకటోనిపల్లిలో గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమిపూజ.
పెద్దమందడి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చీకటోనిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముమ్మాల అశ్విత ఆధ్వర్యంలో...
పట్టుదలతో చదివి న్యాయవాదిగా ఎదిగిన ముప్పూరి నిహారిక.
వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శిబిరం.
టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ ఆదిత్య రెడ్డి.
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలి.
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఘన సన్మానం.