వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శిబిరం.

వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శిబిరం.

-అర్హులైన వారందరికీ అవసరమైన పరికరాల పంపిణీకి ప్రత్యేక శిబిరం

-వంగర గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన రమేష్

భీమదేవరపల్లి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలంలోని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు సహాయ పరికరాలు అందించేందుకు ఈ నెల 27వ తేదీన శుక్రవారం ముల్కనూరులోని శ్రీ సాయి గార్డెన్స్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు వంగర గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ తెలిపారు.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిబిరంలో అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు వారి అవసరాలకు అనుగుణంగా సహాయ పరికరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వృద్ధాప్యం, వైకల్యం కారణంగా రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించి, వారు ఇతరులపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

కావున భీమదేవరపల్లి మండలంలోని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన పత్రాలతో శిబిరానికి హాజరుకావాలని సర్పంచ్ గజ్జెల సృజన రమేష్ కోరారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత సిబ్బంది సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టుదలతో చదివి న్యాయవాదిగా ఎదిగిన ముప్పూరి నిహారిక. పట్టుదలతో చదివి న్యాయవాదిగా ఎదిగిన ముప్పూరి నిహారిక.
పెద్దమందడి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు): పట్టుదల, కష్టపడే తత్వం, చదువుపై ఆసక్తి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన ముప్పూరి...
వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శిబిరం.
టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ ఆదిత్య రెడ్డి.
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలి.
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఘన సన్మానం.
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.