చీకటోనిపల్లిలో గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమిపూజ.
Views: 0
On
పెద్దమందడి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చీకటోనిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముమ్మాల అశ్విత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పరిపాలనకు, ప్రజలకు అందించే సేవలకు నూతన భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బలీదు పల్లి సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, రామచంద్రయ్య గౌడ్,డీలర్ శ్రీనివాసులు, వివేక్, బాజా శ్రీను, విక్రమ్ రెడ్డి, సర్పంచ్ భర్త రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Nov 2026 18:45:02
పెద్దమందడి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చీకటోనిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముమ్మాల అశ్విత ఆధ్వర్యంలో...


Comments