అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!

అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!

కేశవనగర్‌ శివారులో అనుమతులు లేకుండా మొరం రవాణా

పెట్రోలింగ్‌లో పట్టుబడిన టిప్పర్‌.. వాహనం స్వాధీనం, కేసు నమోదు

ధర్మసాగర్‌, నవంబర్‌ 24 (తెలంగాణ ముచ్చట్లు):

అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ధర్మసాగర్‌ సీఐ అనుముల శ్రీనివాస్‌ హెచ్చరించారు. అక్రమ మొరం రవాణాకు పాల్పడుతున్న టిప్పర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
సీఐ అనుముల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కేశవనగర్‌ గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్‌లో మొరం తరలిస్తున్న వ్యక్తిని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, మొరం తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనపై ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్సై సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం, ఇతర ఖనిజ సంపదను అక్రమంగా తరలించే వారిపై నిరంతరం నిఘా ఉంచుతామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అనుముల శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన. చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన.
చర్లపల్లి,నవంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు): స్వామి రాందేవ్ బాబా ఆశీస్సులతో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హరినాథరావు గురూజీ సారథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని...
హనుమకొండ జిల్లాలో విజయవంతమైన పల్స్‌ పోలియో .
నేతాజీ నగర్, శివశక్తి వాసులతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలి.