మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు.. 365 వత్తులతో దీపారాధన

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ఘనపూర్‌, నవంబర్‌ 24 (తెలంగాణ ముచ్చట్లు):

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనపూర్‌ మండల కేంద్రంలోని ప్రసిద్ధ మర్రిచెట్టు శివాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటు 365 వత్తులతో దీపారాధన చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

కార్తీక మాసం శివారాధనకు విశేష ప్రాధాన్యత కలిగిన పవిత్ర మాసం కావడంతో నెల రోజుల పాటు భక్తులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తమ ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ, ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేయడం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

మర్రిచెట్టు శివాలయంలో పూజారులు రామలింగశర్మ, ప్రవీణ్‌ శర్మ, శ్రీనివాస్‌ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బండ్ల రాధాకృష్ణ, అరుణకుమారి దంపతులు, కొలిపాక సునీత సతీష్‌ దంపతులు, గట్టు సుకన్య, రంజిత్‌, గట్టు రజిత, కుమారస్వామి, గణేష్‌ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సంవిధాన్ రక్షా మార్చ్ విజయానికి తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు. సంవిధాన్ రక్షా మార్చ్ విజయానికి తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు.
* సంవిధాన్ రక్షా మార్చ్ విజయవంతానికి ప్రతి డివిజన్ నుంచి 100 మంది తరలిరావాలి   * తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ జెండా...
కుత్బుల్లాపూర్‌ డీఎంహెచ్‌ఓలో ఆకస్మిక తనిఖీలు.
కాంగ్రెస్ పింఛన్లను కేసీఆర్ ఖాతాలో వేయడం సిగ్గుచేటు!
చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన.
హనుమకొండ జిల్లాలో విజయవంతమైన పల్స్‌ పోలియో .
నేతాజీ నగర్, శివశక్తి వాసులతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!