కాంగ్రెస్ పింఛన్లను కేసీఆర్ ఖాతాలో వేయడం సిగ్గుచేటు!

కాంగ్రెస్ పింఛన్లను కేసీఆర్ ఖాతాలో వేయడం సిగ్గుచేటు!

* ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలి 

* కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

జమ్మికుంట, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు మంజూరు చేస్తున్న నూతన పింఛన్లను గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించినవిగా ప్రచారం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మానుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హితవు పలికారు.
మంగళవారం జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ ప్రచార కమిటీ సభ్యుడు సాయిని రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన నిరుపేదలకు నూతన పింఛన్లు మంజూరు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి కుటుంబానికి ప్రమాద బీమా పథకాన్ని అందించే దిశగా కూడా చర్యలు చేపడుతోందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూడటం సరికాదన్నారు. ప్రజలకు ఎవరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో, ఎవరి హయాంలో కొత్త పింఛన్లు మంజూరవుతున్నాయో స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తమ ఘనతగా చెప్పుకోవడం మానుకోవాలని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమనేని పరశురామారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దొడ్డే శ్రీకాంత్, మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, పొనగంటి విష్ణు, ఎగిత అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, మానుపాటి సూర్య, పొనగంటి మధు, పూరెల్ల రాకేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలీం, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, పర్లపల్లి నాగరాజు, సజ్జు, పంజాల అజయ్, పాత ప్రసాద్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు గిరవేన శ్రీనివాస్, కొలుగురుIMG-20261124-WA0037 రవి, తిరుపతి రెడ్డి, వేల్పుల ప్రశాంత్, గుల్లి జెఫనియా, టింకరాల కిషోర్, రాకేష్, గుర్రపు ప్రవీణ్, రాసపెల్ అశ్విన్, కొలుగురి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News