కుత్బుల్లాపూర్‌ డీఎంహెచ్‌ఓలో ఆకస్మిక తనిఖీలు.

కుత్బుల్లాపూర్‌ డీఎంహెచ్‌ఓలో ఆకస్మిక తనిఖీలు.

* ఎస్‌ఎన్‌ఐడీ మాప్-అప్ డేలో ఇంటింటి సర్వే పరిశీలన.. 

* మిగిలిన చిన్నారులకు పోలియో టీకాలు..

* జిల్లా జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్ 


మేడ్చల్,నవంబర్24 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి 
డా. కె. ఆనంద్ 
కుత్బుల్లాపూర్‌లోని యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూపీహెచ్‌సీలో నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, సంబంధిత రికార్డుల్లోని వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదైన సమాచారంతో సరిపోల్చి ధృవీకరించారు.
అనంతరం సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే–పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మాప్-అప్ డే కార్యక్రమాన్ని పరిశీలించారు. కుత్బుల్లాపూర్‌లోని గార్డెన్ బస్తీ ప్రాంతంలో చేపట్టిన ఇంటింటి సర్వే ను స్వయంగా పరిశీలించిన డీఎంహెచ్‌ఓ, సర్వే ద్వారా గుర్తించిన పోలియో టీకా తీసుకోని మిగిలిన చిన్నారులకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపివి)చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వేను పూర్తిస్థాయిలో నిర్వహించి, ఒక్క చిన్నారి కూడా టీకాకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి డా. కె. ఆనంద్ సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడంలో వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News