కాంగ్రెస్ ఎస్సీ సెల్ బలోపేతంపై కీలక సమావేశం.
పెద్దమందడి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ బలోపేతం, కమిటీ కార్యకలాపాలపై చర్చించేందుకు నేడు మండల స్థాయి ముఖ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు గట్టు మన్నెం తెలిపారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజ్ కుమార్, మండల ఇన్‌చార్జి శ్రీహరి రాజు హాజరుకానున్నారు.ఈ సమావేశంలో ఎస్సీ సెల్ కమిటీ బలోపేతం, పార్టీ కార్యక్రమాల్లో కమిటీ సభ్యుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నారు. కావున మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ మండల కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని గట్టు మన్నెం కోరారు.


Comments