ప్రపంచ మేయర్ల వేదికపై కరీంనగర్‌కు ప్రాతినిధ్యం.మేయర్ కోలగాని శ్రీనివాస్‌కు ఆహ్వానం.

ప్రపంచ మేయర్ల వేదికపై కరీంనగర్‌కు ప్రాతినిధ్యం.మేయర్ కోలగాని శ్రీనివాస్‌కు ఆహ్వానం.

*ముంబైలో నవంబర్ 25, 26 తేదీల్లో 30 దేశాల మేయర్లతో అంతర్జాతీయ సదస్సు.*

*సదస్సులో కరీంనగర్ నగర అభివృద్ధి నమూనాను వివరించనున్న మేయర్.*

కరీంనగర్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ నగరానికి గుర్తింపు లభించే మరో అవకాశం దక్కింది. ముంబై వేదికగా నవంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక మూడో ప్రపంచ మేయర్ల సదస్సుకు కరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్‌కు ఆహ్వానం అందింది.

ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలకు చెందిన నగరాల మేయర్లు, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొననున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సదస్సులో భవిష్యత్ నగరాల నిర్మాణం, 2047 నాటికి భారత నగరాల పునర్నిర్మాణం, కృత్రిమ మేధస్సుతో పట్టణ నిర్వహణ, వ్యర్థాల సమస్య పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ పెట్టుబడులతో స్థానిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే సురక్షిత నగరాల నిర్మాణం, నదీ తీర నగరాల అభివృద్ధి, ప్రజా రవాణా వ్యవస్థ, కాలుష్య రహిత మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పుల సవాళ్లు, మహానగర పాలన బలోపేతంపై రెండో రోజు చర్చలు జరగనున్నాయి.

ఈ అంతర్జాతీయ వేదికపై కరీంనగర్ నగర అభివృద్ధి నమూనాను వివరించడంతో పాటు, ప్రపంచంలోని వివిధ నగరాల్లో అమలవుతున్న అత్యుత్తమ అభివృద్ధి విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ సదస్సు అవకాశం కల్పించనుంది. అంతర్జాతీయ స్థాయి సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం అందడం నగర అభివృద్ధి అంశాలకు ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం కల్పించే అవకాశంగా నిలవనుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రపంచ మేయర్ల వేదికపై కరీంనగర్‌కు ప్రాతినిధ్యం.మేయర్ కోలగాని శ్రీనివాస్‌కు ఆహ్వానం. ప్రపంచ మేయర్ల వేదికపై కరీంనగర్‌కు ప్రాతినిధ్యం.మేయర్ కోలగాని శ్రీనివాస్‌కు ఆహ్వానం.
*ముంబైలో నవంబర్ 25, 26 తేదీల్లో 30 దేశాల మేయర్లతో అంతర్జాతీయ సదస్సు.* *సదస్సులో కరీంనగర్ నగర అభివృద్ధి నమూనాను వివరించనున్న మేయర్.* కరీంనగర్, నవంబర్ 24...
ఫుట్‌పాత్‌ లేక పాదచారుల నరకయాతన!
చీకటోనిపల్లిలో గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమిపూజ.
పట్టుదలతో చదివి న్యాయవాదిగా ఎదిగిన ముప్పూరి నిహారిక.
వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శిబిరం.
టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ ఆదిత్య రెడ్డి.
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి.