సంవిధాన్ రక్షా మార్చ్ విజయానికి తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు.
* సంవిధాన్ రక్షా మార్చ్ విజయవంతానికి ప్రతి డివిజన్ నుంచి 100 మంది తరలిరావాలి
* తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.
* మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడ్చల్,నవంబర్24 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా డివిజన్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.
ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షా కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. లిబర్టీ సర్కిల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన సంవిధాన్ రక్షా మార్చ్‌ను విజయవంతం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డీసీసీ జిల్లా మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కున్న శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి,హనుమంత్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి లక్ష్మీకాంత్ రెడ్డి
జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ , జిల్లా డివిజన్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments