అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.

భీమదేవరపల్లి, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.భీమదేవరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కొప్పూరు వైపు నుంచి ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించి ఆపి తనిఖీ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను విచారించగా, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ యాకూబ్ పాషా (31)గా గుర్తించారు.

పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని మానేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్‌లో నింపుకొని ముల్కనూర్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఇసుక తరలింపునకు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవని అంగీకరించడంతో ట్రాక్టర్‌తో పాటు డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు* శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు*
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో...
ముక్కోటి ఏకాదశి నాటికి* *" భద్రాద్రి"ని సిద్ధం చేస్తాం
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ.
మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.