వరల్డ్ మేయర్స్ సదస్సులో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం.
*ముంబై మేయర్‌తో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఘన స్వాగతం.*
*అంతర్జాతీయ వేదికపై కరీంనగర్‌కు గుర్తింపు.*
కరీంనగర్, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
ముంబై వేదికగా నిర్వహించిన వరల్డ్ మేయర్స్ సదస్సులో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు ప్రత్యేక గౌరవం లభించింది. సదస్సులో భాగంగా ముంబై మేయర్‌తో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఘనంగా స్వాగతం పలికే అవకాశం ఆయనకు దక్కింది. దేశవిదేశాలకు చెందిన పలు ప్రముఖ నగరాల మేయర్లు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ అంతర్జాతీయ వేదికపై కొలగాని శ్రీనివాస్‌కు ఈ ప్రత్యేక గుర్తింపు లభించడం విశేషం.
ఈ సదస్సులో పట్టణాభివృద్ధి, భవిష్యత్ నగరాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల ఆధునీకరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన పట్టణాభివృద్ధి మంత్రులు సైతం పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భవిష్యత్ నగరాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికపై తెలంగాణ రాష్ట్రం తరపున కరీంనగర్ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికే అవకాశం లభించడం పట్ల మేయర్ కొలగాని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు.


Comments