మాస్టర్ ప్లాన్ రోడ్డుపైనే భవనాలు.. అధికారుల మౌనం వెనుక మాస్టర్ ప్లాన్.?..
* చీర్యాల ద్వారక ఎన్‌క్లేవ్‌లో హెచ్‌ఎండీఏ రోడ్డుపైనే నిర్మాణాలు.. కీసరలో కలకలం!..
* అనుమతులు ఉన్నాయా ఉంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారు.. అధికారులపై స్థానికుల ప్రశ్నలు!..
* ఫిర్యాదులు వచ్చినా స్పందన శూన్యం.. భారీ అవినీతికి మాస్టర్ ప్లాన్ లో భాగమేనా!..
* తక్షణ విచారణ జరపాలి.. అధికారులు వివరణ ఇవ్వాల్సిందే.. చర్యలు తీసుకోవాల్సిందే!..
కీసర, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు):
కీసర సర్కిల్ పరిధిలో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అధికారులే, భారీ అవినీతికి మాస్టర్ ప్లాన్ వేశారా? అన్న ప్రశ్న ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చీర్యాలలోని ద్వారక ఎన్‌క్లేవ్‌లో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డుపై చేపడుతున్న భవన నిర్మాణాలే ఈ అనుమానాలకు కారణం. నిబంధనలు, నిర్మాణ అనుమతులపై స్పష్టత లేకుండానే పనులు శరవేగంగా సాగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ రోడ్డు విషయంలోనే నిబంధనల ఉల్లంఘన జరిగితే.. సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు? అని స్థానికులు నిలదీస్తున్నారు..
*గతంలోనూ ఫిర్యాదులు.. అయినా స్పందన శూన్యం!..*
ద్వారక ఎన్‌క్లేవ్‌లో అక్రమ నిర్మాణాలపై గతంలోనూ అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి.
అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు సమర్థవంతంగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ పనులు కళ్లెదుటే వేగంగా సాగుతున్నా తనిఖీలు ఎందుకు లేవన్నది స్థానికుల ప్రశ్న. ఈ మౌనమే అనుమానాలకు ఆజ్యం పోస్తోందని వారు అంటున్నారు..
*టౌన్ ప్లానింగ్ అధికారులకు సూటి ప్రశ్నలు..సమాధానం చెప్పాల్సిందే..*
• ఈ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు ఏమిటి?..
• ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారు?..
• మాస్టర్ ప్లాన్ రోడ్డు పరిధిలో నిర్మాణానికి ఎలా అవకాశం కల్పించారు?..
• హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు హద్దులను క్షేత్రస్థాయిలో ఎప్పుడైనా పరిశీలించారా?..
• నిబంధనల ఉల్లంఘన జరిగితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?..
• ప్రభుత్వ రోడ్డు స్థలంలో నిర్మాణాలు సాగుతుంటే అధికారుల కళ్లకు కనిపించలేదా? లేక కావాలనే కళ్లు మూసుకున్నారా?..
• ఇదంతా భారీ అవినీతికి వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగమేనా?..
*తక్షణ విచారణకు డిమాండ్..*
ఇప్పటికైనా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు, భూమి వివరాలు, మాస్టర్ ప్లాన్ రోడ్డు హద్దులను పరిశీలించాలని కోరుతున్నారు. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టప్రకారం నిర్మాణ పనులు నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు. అలాగే ఈ వ్యవహారంపై అధికారులు అధికారికంగా స్పందించి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలన్నది ప్రధాన డిమాండ్..
*ఇప్పుడు ప్రధాన ప్రశ్న..*
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే మౌనం వహిస్తే.. ప్రజలకు సమాధానం చెప్పేదెవరు? మాస్టర్ ప్లాన్‌కే పాతరేస్తే.. జవాబుదారీ ఎవరిది? టౌన్ ప్లానింగ్ అధికారులు వివరణ ఇవ్వాల్సిందే.. చర్యలు తీసుకోవాల్సిందే! మరిన్ని కథనాలతో మీ తెలంగాణ ముచ్చట్లు తెలుగు దినపత్రిక సంచికలో..


Comments