హనుమాన్ విగ్రహానికి విరాళంగా రూ.21 వేలు అందించిన కౌకుట్ల రాహుల్ రెడ్డి.
నాగారం, నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
ఘట్కేసర్ సర్కిల్ పరిధి నాగారం డివిజన్లోనిరాంపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన కోసం
హనుమాన్ విగ్రహానికి నాగారం డివిజన్ బిజెపి పార్టీ యువ నాయకుడు కౌకుట్ల రాహుల్ రెడ్డి రూ. 21,000/- విరాళంగా ఇచ్చారు.
రాంపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ విగ్రహానికి, దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రముఖ నాయకులు / దాత కౌకుట్ల రాహుల్ రెడ్డి రూ. 21,000 (ఇరవై ఒక్క వేల రూపాయలు) నగదును విరాళంగా అందజేసినందుకు
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు రాహుల్ రెడ్డిని శాలువాతో సత్కరించి, ఆలయ అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. అనంతరం రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం నా వంతుగా విరాళాన్ని అందించడం,దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments