శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు*

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి పొంగులేటి

శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు*

ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు )

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారుIMG-20261125-WA0057

నూతన జంటలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పిల్లాపాపలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఖమ్మంలోని కావేరి రిసార్ట్స్‌లో దగ్గుపాటి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం లక్ష్మీ చంద్ర గార్డెన్స్‌లో ఖమ్మం కొత్తగూడెం 15వ డివిజన్‌కు చెందిన మొర్రి మేకల అమరయ్య కుమారుడి వివాహానికి, సూర్యదేవర ఫంక్షన్‌ హాల్‌లో ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌ గ్రామానికి చెందిన అనంతుల లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానికి, టేకులపల్లి లోని రాజరాజేశ్వరి కన్వెన్షన్ సెంటర్లో మాణిక్య నగర్ కు చెందిన కొండూరు గోవిందరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.
అలాగే ఖానాపురంలోని కొలిపాక ఫంక్షన్‌ హాల్‌లో కొండబోయిన పిచ్చయ్య కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు. కారేపల్లిలో గుగులోతు రవి నాయక్‌ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను మనస్ఫూర్తిగా దీవించారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..:* టేకులపల్లి వద్ద బొమ్మనపల్లి ధర్మయ్య కూతురి వివాహ వేడుకకు, కొత్తగూడెంలోని ఎస్ కే టి అపార్ట్మెంట్స్ హనుమాన్ బస్తీలో కాకొల్లు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరై దీవించారు.
*ఈ కార్యక్రమాల్లో..:* ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వైద్య విద్యార్థినికి మంత్రి పొంగులేటిభరోసా. వైద్య విద్యార్థినికి మంత్రి పొంగులేటిభరోసా.
* ఎంబీబీఎస్ పూర్తి చేసే వరకు ఏటా ఆర్థిక సాయం చేస్తానని అభయం  * తొలివిడతగా రూ.50 వేలు అందజేసి అండగా నిలిచిన శీనన్న  ఖమ్మం బ్యూరో,...
శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు*
ముక్కోటి ఏకాదశి నాటికి* *" భద్రాద్రి"ని సిద్ధం చేస్తాం
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ.
మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.