ఘనంగా సీఎంఆర్ స్కూల్లో క్రీడా మహోత్సవ ప్రారంభం..

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి.. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి .

ఘనంగా సీఎంఆర్ స్కూల్లో క్రీడా మహోత్సవ ప్రారంభం..

కీసర, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థుల్లో క్రీడ నైపుణ్యాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కుందన్ పల్లి లోని సీఎంఆర్ స్కూల్ లో నిర్వహిస్తున్న క్రీడా మహోత్సవం -2026 కార్యక్రమాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. క్రీడా పోటీలు రెండు రోజులపాటు జరిగే ఈ క్రీడా మహోత్సవంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 31 పాఠశాలలు పాల్గొన్ననున్నాయన్నారు.
31 పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యంతో  స్పోర్ట్స్ డే సందర్భంగా సీఎంఆర్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు. అనంతరం రెండు రోజులపాటు నిర్వహించే క్రీడా పోటీల్లో చుట్టుపక్కల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 31 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ మహోత్సవంలో భాగస్వాములు కావడంతో వివిధ పాఠశాల విద్యార్థులకు క్రీడా వేదికగా ఏర్పాటైయింది.  విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ముఖ్య ఉద్దేశం. అనంతరం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని అన్నారు. విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలనేదే తన ఉద్దేశమని, తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్తూ, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని మల్లారెడ్డి పేర్కొన్నారు. అలాగే విద్యార్థులతో కలిసి నృత్యం కార్యక్రమంలో విద్యార్థుల  తల్లిదండ్రులతో కలిసి మల్లారెడ్డి నృత్యం చేసి అందరినీ ఆలరించారు. రెండు రోజులపాటు జరిగే క్రీడా మహోత్సవంలో పాల్గొనే పాఠశాల విద్యార్థులకు పోటీల్లోతమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించామన్నారు. IMG-20261125-WA0020IMG-20261125-WA0019

Tags:

Post Your Comments

Comments

Latest News

దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి. దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
పెద్దమందడి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు): దళితుల హక్కుల సాధన, సామాజిక అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజ్...
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.
కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టే నాలుగు కార్మిక కోడ్‌లు!
ఘనంగా సీఎంఆర్ స్కూల్లో క్రీడా మహోత్సవ ప్రారంభం..
వరల్డ్ మేయర్స్ సదస్సులో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం.
మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు.
టీ కేఫ్‌ల వెనుక ధూమపాన అడ్డాలు.. యువత ఆరోగ్యంపై ఆందోళన!