దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
రాజ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు.
పెద్దమందడి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
దళితుల హక్కుల సాధన, సామాజిక అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. పెద్దమందడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు గట్టు మన్నెం అధ్యక్షతన నిర్వహించినదళిత చైతన్య సభ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ నెల 28న నాగర్కర్నూల్లో నిర్వహించనున్న దళిత చైతన్య సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సభ ఆవశ్యకతను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చూడాలని సూచించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దళిత వర్గాల ఐక్యత, హక్కుల పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించే ఈ సభకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ దళిత కుటుంబాల సంక్షేమం, అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు గట్టు దయాకర్, సురేష్, చిన్నమందడి గ్రామ సర్పంచ్ స్వరూప, మండల ఉపాధ్యక్షులు దండు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శులు కొమ్ము సాయిబాబా, గట్టు రాజు, కార్యదర్శి అల్వాల రాజుతో పాటు బలిజపల్లి, జంగమయ్యపల్లి, మణిగిల్ల, చిన్నమందడి, పెద్దమందడి, దొడగుంటపల్లి తదితర గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments