బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పీజేఆర్.

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పీజేఆర్.

జమ్మికుంట, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పొనగంటి రవికుమార్ (పీజేఆర్) నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, జిల్లా నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యత అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీజేపీ ప్రతిష్టను మరింత పెంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పొనగంటి రవికుమార్ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు* శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు*
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో...
ముక్కోటి ఏకాదశి నాటికి* *" భద్రాద్రి"ని సిద్ధం చేస్తాం
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ.
మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.