మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

కుటుంబ సమస్యల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి.. 

మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సుIMG-20261125-WA0041నీల్ దత్ సందర్శించి స్టేషన్ పనితీరును, కేసుల దర్యాప్తు పురోగతిని, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై సిబ్బందితో సమీక్షించారు.
మహిళా పోలీస్ స్టేషన్‌కు సున్నితమైన కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఫిర్యాదును సానుకూల దృక్పథంతో, బాధ్యతాయుతంగా పరిశీలించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. కుటుంబ సమస్యల విషయంలో ఇరు పక్షాల వాదనలు ఓపికగా విని, చట్టపరిధిలో సాధ్యమైన మేరకు కౌన్సెలింగ్ ద్వారా సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో మహిళలపై వేధింపులు, గృహహింస, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, బాధిత మహిళలకు భరోసా కల్పిస్తూ చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే మహిళలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సిబ్బంది పనిచేయాలని పోలీస్ కమిషనర్ దిశానిర్దేశం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ. ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ.
–పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు ..అడిషనల్ డీసీపీ రామానుజం ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ) ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షల...
మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.
కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టే నాలుగు కార్మిక కోడ్‌లు!
ఘనంగా సీఎంఆర్ స్కూల్లో క్రీడా మహోత్సవ ప్రారంభం..