ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.

ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు )

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియకు హాజరవుతున్న బాధితులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. వెరిఫికేషన్ కోసం వచ్చే బాధితులకు క్రమబద్ధంగా సేవలు అందించేలా, రద్దీ లేకుండా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచారు. బాధితులు తమకు కేటాయించిన తేదీల ప్రకారం హాజరై, ముందుగా క్రమపద్దతిలో టోకెన్ తీసుకుని సంబంధిత బాండ్ పత్రాలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి వెరిఫికేషన్ ప్రక్రియను క్యూ లైన్ లో సజావుగా పూర్తి చేస్తున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామీనాలు, మంచినీటిIMG-20261125-WA0042 సౌకర్యం ఏర్పాటు చేశారు.  సిసీఎస్ ఏసీపీ సర్వర్ ఆధ్వర్యంలో  అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వెరిఫికేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ. ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ) అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని...
దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.
కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టే నాలుగు కార్మిక కోడ్‌లు!
ఘనంగా సీఎంఆర్ స్కూల్లో క్రీడా మహోత్సవ ప్రారంభం..
వరల్డ్ మేయర్స్ సదస్సులో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం.
మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు.