కులవివక్ష లేని సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యం.

బుర్రి సతీష్ మాదిగ ఉమ్మడి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్,.

కులవివక్ష లేని సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యం.

వనపర్తి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు): 

కులవివక్ష లేని సమాజ నిర్మాణం, సామాజిక సమానత్వం సాధించడమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యమని ఆ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి బుర్రి సతీష్ మాదిగ అన్నారు. వనపర్తి పట్టణంలోని ఎంవైఎస్ మినీ ఫంక్షన్ హాల్‌లో మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు మొలకలపల్లి పరశురాముడు మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ సమన్వయం చేశారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న బుర్రి సతీష్ మాదిగ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు జాతి అభ్యున్నతికి బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటికీ మాదిగలు, అణగారిన వర్గాలు కులవివక్ష, అంటరానితనం, సామాజిక, ఆర్థిక అసమానతలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులవ్యవస్థ నిర్మూలన, సమానత్వ సాధన కోసం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చేస్తున్న సామాజిక పోరాటాల్లో విద్యార్థులు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కోరారు.అనంతరం బుర్రి సతీష్ మాదిగ వనపర్తి జిల్లా మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా పుట్టపాగ అజయ్ కుమార్ మాదిగ, అధికార ప్రతినిధిగా కేశపాగ భాస్కర్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా దయ్యపు రామ్ చరణ్ మాదిగ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్, దయ్యపు కృష్ణ, కార్యదర్శులుగా గడ్డం మీది రవితేజ, బండారి విష్ణు, అభిలాష్ ఎంపికయ్యారు.జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా భారతరత్న మాదిగ, అధికార ప్రతినిధిగా శ్వేత మాదిగ, ప్రధాన కార్యదర్శిగా కావ్య మాదిగ, ఉపాధ్యక్షురాలిగా ప్రేమకుమారి మాదిగ, కార్యదర్శిగా చైతన్య మాదిగ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సహ ఇన్‌చార్జి మీసాల గణేష్ మాదిగ సమన్వయం చేశారు.ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఇన్‌చార్జి మంద నరసింహ మాదిగ, ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ అజ్జపాగ లక్ష్మణ్ మాదిగ, బుక్కాపురం మహేష్ మాదిగ, కమలాకర్ మాదిగ, గణేష్ మాదిగతో పాటు పలువురు ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు* శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు*
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో...
ముక్కోటి ఏకాదశి నాటికి* *" భద్రాద్రి"ని సిద్ధం చేస్తాం
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ.
మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.