ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ.
–పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు
..అడిషనల్ డీసీపీ రామానుజం
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు )
ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షల నిర్వహణలో ప్రిలిమినరీ పారదర్శకత, క్రమశిక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని అడిషనల్ డీసీపీ (నోడల్ ఆఫీసర్) రామానుజం అధికారులు సూచించారు.
తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో నవంబర్ 29, ఆదివారం నిర్వహించనున్నా సబ్-ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి 34 పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తించే 95 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉమేన్స్ డిగ్రీ కాలేజ్ లో నిర్వహించారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణ, బయోమెట్రిక్ వివరాల నమోదు, వేలిముద్రల సేకరణ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. బయోమెట్రిక్ ప్రక్రియను నిబంధనల ప్రకారం ఎలాంటి సాంకేతిక లోపాలకు తావులేకుండా నిర్వహించే విధానాన్ని వివరించారు.
కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ బానోత్ రెడ్డి (ప్రిన్సిపాల్ ఉమేన్స్ కాలేజ్) , 
అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ సాంబరాజు, పోలీస్ బయోమెట్రిక్ ఆఫీసర్ లవన్ కుమార్ పాల్గొన్నారు.


Comments