మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

హన్మకొండ, తెలంగాణ ముచ్చట్లు: ఆకస్మికంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన  చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే  నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  జనార్దన్ గత సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదిన అనారోగ్యం తో మరణించాడు. దీనితో తెలంగాణ పోలీస్ భద్రత పథకం ద్వారా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరు చేసిన 7 లక్షల 89 వేల రూపాయల చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు, శాఖపరంగా రావల్సిన బెనిఫిట్లను అందజేసేందుకు తక్షణ చర్యలు గైకొనాల్సిందిగా పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో అదనపు డీసీపీ రవి, పరిపాలన విభాగం ఏవో రామకృష్ణ స్వామి, సెక్షన్ సూపరింటెండెంట్  రమాదేవి, సహాయ సిబ్బంది శ్రవణ్ పాల్గోన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......