వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
హనుమాన్ విగ్రహ ధ్వంసంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్
జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
వేచరేణి గ్రామంలోని ఎల్ల దాసు నగర్‌లో ఇటీవల హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దురదృష్టకర సంఘటనను ఖండిస్తూ, బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ… హనుమాన్ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక వ్యక్తి మద్యం మత్తులో హనుమాన్ సహా ఇతర హిందూ దేవతల విగ్రహాలను కాళ్లతో తన్ని అవమానపరిచినందున స్థానిక ప్రజలు, భక్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.
ఈ ఘటనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటనను బీజేపీపై బురద చల్లే అవకాశంగా మార్చుకుంటూ, హిందువుల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా పనులు చేస్తున్నాయన్నారు. బీజేపీ దళితుల, బడుగు బలహీన వర్గాల పార్టీగా నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని, దళితుణ్ని రాష్ట్రపతి పదవికి అందించిందే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ ఎప్పటికీ కులాన్ని కాదు, కృషిని ప్రోత్సహించేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్, కేవీఎల్ఎన్ రెడ్డి, ఆరుట్ల దశమంతరెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, భువనగిరి పార్లమెంటు కన్వీనర్ కొంతం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం సురేందర్, సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కుర్రారం బాలనరసయ్య, బంగారు మహేష్, తోకల ఉమారాణి, దండ్యాల లక్ష్మారెడ్డి, బూర్గోజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments