విజయ డైరీ నూతన ఉత్పత్తులు విడుదల చేసిన ఎంపి కడియం కావ్య 

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన పాలను అందించడమే లక్ష్యం 

విజయ డైరీ నూతన ఉత్పత్తులు విడుదల చేసిన ఎంపి కడియం కావ్య 

-వరంగల్ తెలంగాణ ముచ్చట్లు

విజయ డైరీ పాలు, పాల పదార్థాల నూతన ఉత్పత్తులను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమం వరంగల్‌లోని విజయ డైరీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన పాలను అందించాలన్నదే విజయ డైరీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సహకార రంగంలో మెరుగైన సేవలు అందించేందుకు కేంద్రంతో అనుసంధానానికి తాను ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్‌లో విజయ డైరీకి కొత్త ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.


WhatsApp Image 2025-05-24 at 9.05.14 PM (1) రాష్ట్రంలో రైతే రాజు అని పేర్కొంటూ, ప్రభుత్వం త్వరలోనేలోటు బడ్జెట్‌ను అధిగమించి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు. విజయ డైరీ కొత్త ఉత్పత్తులు సామాన్య ప్రజలు సులభంగా వినియోగించుకోగలిగేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జనరల్ మేనేజర్ మల్లయ్య, మధుసూదన్, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .