పదవ తరగతి ఫలితాల్లో మండలంలో మొదటి స్థానంలో ప్రదీప్ యాదవ్
553 మార్కులతో మెరిసిన కూరేళ్ల గ్రామ విద్యార్థి
సిద్దిపేట, తెలంగాణ ముచ్చట్లు:
కోహెడ మండలం కూరేళ్ల గ్రామానికి చెందిన ఇట్టవేణి ప్రదీప్ యాదవ్ పదవ తరగతి పరీక్షల్లో 553 మార్కులు సాధించి మండలస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించాడు. ఇతను ఇట్టవేణి శారద, ఐలయ్య యాదవ్ దంపతుల కుమారుడు.
కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తూ చదువులో అసాధారణ ప్రతిభ కనబరిచిన ప్రదీప్‌ను ఆయన నివాసానికి చేరుకొని కోహెడ మండల యాదవ సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. సంఘ అధ్యక్షుడు పలుమారు సంతోష్ యాదవ్, ఉపాధ్యక్షుడు అమ్ముల ఉపేందర్ యాదవ్, మండల సభ్యులు లెంకల సంపత్ యాదవ్, ఇట్టవేణి ఓంకార్ యాదవ్, ఇట్టవేణి రాజు తదితరులు అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో ప్రదీప్ ఉన్నత విద్యలో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు, ప్రతిష్ఠలు తేవాలని ఆకాంక్షించారు. విద్యార్థి విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments