పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

-వెలిజర్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

షాద్ నగర్,తెలంగాణ ముచ్చట్లు:

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెలిజర్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగింది. లబ్ధిదారులతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని తెలిపారు. పేదల అభివృద్ధే తమ ప్రథమ విధేయత అని పేర్కొన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పాలనలోనే పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ నిబద్ధతతో పని చేస్తున్నారని నేతలు తెలిపారు. పేదల కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాడ్యాల నర్సింహా రెడ్డి, అనిమి చిన్న శివరాజ్ గౌడ్, జాంగారి రవి, కటికెల మంగమ్మ, తిరుపతి యాదవ్, పాత్లవత్ లక్ష్మి రఘు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాడ్యాల శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జాంగారి జంగయ్య, సీనియర్ నేతలు అనిమి గణేష్ గౌడ్, చాకలి కృష్ణ, కటికెల తిరుపతి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాంగారి నర్సింహులు, మందాడి ముకుంద గౌడ్, తుప్పారీ శేఖర్, మట్ట వెంకటేష్ గౌడ్, జనుముల యాదయ్య, కావాలి యాదయ్య, దామర్లపల్లి యాదయ్య, దిర్షనం వెంకటేష్, మంద రాజు, కొత్త రాఘవేందర్, వట్టేల మహేష్ యాదవ్, అన్వర్, యాదయ్య, మంగలి ప్రవీణ్, పత్లవత్ రవి, దిర్షణం సాయి, జాంగారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250525-WA0060

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .