విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు అవసరం
ఘనంగా ఎఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం
-టి. సత్య ప్రసాద్, సల్మాన్ బిగ్ ఎఐవైఎఫ్ అధ్యక్షా,కార్యదర్శి
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా నాయకులు టి. సత్య ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసీఐఎల్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ ఎం. యోగిత జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బిగ్, కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి. యువతలో అభ్యుదయ భావజాలాన్ని, నైతిక విలువలను, మానవతా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఎఐవైఎఫ్ కృషి చేస్తోంది,” అని తెలిపారు.
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, సుభాష్‌చంద్రబోస్ వంటి మహనీయుల ఆదర్శాలను కొనసాగిస్తూ, స్వాతంత్ర్యోద్యమం నుంచి నేటి వరకు యువత కోసం ఎఐవైఎఫ్ పోరాటం సాగిస్తోందన్నారు. 1959 మే 3న ఏర్పాటు అయిన ఎఐవైఎఫ్, నల్లదొరల దోపిడీకి ప్రతిఘటిస్తూ యువజన ఉద్యమాలను ముందుకు నడిపిస్తోందని తెలిపారు.
పనిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి, సమగ్ర యువజన విధానం రూపుదిద్దుకోవాలి. విద్య, వైద్య రంగాల వాణిజీకరణను వెంటనే నిలిపివేయాలని, అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. “ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలి. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్టును రూపొందించి అమలు చేయాలని మనం కోరుతున్నాం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిబాబు, నాయకులు సాయి, స్వప్న, హారిక, ఫరా ఫాతిమా, మధు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఈ. సతీష్ కుమార్, మహేష్ బాబు, ఎండి. హాజిమ్, సోయల్ తదితరులు పాల్గొన్నారు.
Comments