అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని,ఇంచార్జ్ ఝాన్సిరెడ్డి

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని,ఇంచార్జ్ ఝాన్సిరెడ్డి

తొర్రూరు,తెలంగాణ ముచ్చట్లు :

పాలకుర్తి నియోజకవర్గంలోని మడిపెల్లి గ్రామంలో ఆదివారం భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ –
“అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ భావోద్వేగానికి లోనైన ఘట్టం. సమాన హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానాయకుడిని స్మరించుకునే పుణ్యక్షణం. ఆయనే అందించిన రాజ్యాంగ విలువల బాటలో నడవాలి. ప్రతి గ్రామంలో ఆయన విగ్రహం ఉండడం ద్వారా యువతలో అవగాహన పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అంబేద్కర్ ఆశయాలను తెలియజేస్తాం” అని తెలిపారు.

ఇంచార్జ్ ఝాన్సిరెడ్డి మాట్లాడుతూ –
“అంబేద్కర్ జీవితమే ఒక ఉద్యమం. ఆయన సిద్ధాంతాలు కేవలం ఓ వర్గానికి కాకుండా సమాజమంతటికీ మార్గదర్శకాలు. మహిళలు, దళితులు, అణగారిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మడిపెల్లిలో ఈ విగ్రహ ఆవిష్కరణ గ్రామానికి గర్వకారణం” అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు, మహిళా నాయకులు, గ్రామస్థులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .