మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం

ప్రతిభకు గౌరవం, సేవకు సన్మానం

మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం

-మెగా ఈవెంట్‌కు శ్రీకారం 

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘సేవ ప్రతిభ అవార్డ్స్ – 2025’ మరియు ‘నంది అవార్డ్స్ – 2025’ కార్యక్రమానికి మే 31న హైదరాబాద్ వేదిక కానుంది. వివిధ రంగాల్లో సేవా తపనతో ముందుకు సాగుతున్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని వేదికపై గౌరవించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకురాలు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శిరీష రెడ్డి మాట్లాడుతూ 
“సామాజిక సేవ, విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, పారిశ్రామిక అభివృద్ధి, యువజన సేవ, మహిళా సాధికారత తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రతిభావంతులను ఎంపిక చేసి ఈ అవార్డుల ద్వారా గౌరవించబోతున్నాం. సామాన్యుని కృషికి గుర్తింపు దొరకాలని, వారి సేవలు సమాజానికి తెలియజేయాలన్నదే మా లక్ష్యం.” అని చెప్పారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినీ, టెలివిజన్ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, ఎంపికైనవారికి అవార్డులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ఇదే కాకుండా, ఈ కార్యక్రమం ద్వారా కొత్త సేవా దిశలకు ప్రోత్సాహం కలుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపిన శిరీష రెడ్డి, ఆసక్తి కలిగిన వారు తమ సేవా వివరాలు, ఫోటో, ప్రూఫ్‌లు, సంప్రదింపుల సమాచారంతో కూడిన దరఖాస్తులను వెంటనే పంపించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 20, 2025గా నిర్ణయించారు.

మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని  
90144 84952 ,95616 41973 తెలిపారు.“ప్రతిభను గుర్తించడం, సేవను గౌరవించడం మానవతా దృక్కోణానికి ప్రాతినిధ్యం వహిస్తుంది” అని శిరీష రెడ్డి అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం