పేదల పాలిట వరం సిఎంఆర్ఎఫ్ 

పేదల ఆరోగ్యానికి సహాయంగా సీఎం సహాయనిధి

పేదల పాలిట వరం సిఎంఆర్ఎఫ్ 

-93 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నాయిని 

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ఆరోగ్య పరంగా సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయనిధి విశేషంగా ఉపయోగపడుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హనుమకొండలోని బాలసముద్ర ప్రాంతంలోని ప్రజా భవన్‌లో 93 మంది లబ్ధిదారులకు రూ. 37.43 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్ నిధుల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారు మెరుగైన వైద్యం పొందే అవకాశాన్ని సృష్టించామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. స్థానికంగా ప్రతి నెలనూ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

అనారోగ్యంతో బాధపడే వారు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్నవారికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా సహాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. విద్యా, వైద్య రంగాల్లో అందరికీ సమానంగా అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-29 at 10.16.21 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .