ఘనంగా మెపా డైరీ ఆవిష్కరణ

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ముదిరాజ్'లు ఐక్యతతో పని చేయాలి

ఘనంగా మెపా డైరీ ఆవిష్కరణ

-ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం

-మెపా ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్ ముదిరాజ్
  
 -మెపా ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులు బండి రాజు ముదిరాజ్


ములుగు,తెలంగాణ ముచ్చట్లు: 

ములుగు జిల్లా కేంద్రంలోని మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్) జిల్లా కార్యాలయంలో మెపా వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు, మెపా ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్ అధ్వర్యంలో ఘనంగా మెపా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈకార్యక్రమానికి మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షులు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, బండి రాజు ముదిరాజ్ విచ్చేసి డైరీ ఆవిష్కరణ చేశారు,ఈ సందర్భంగా అచ్చునూరి కిషన్ ముదిరాజ్,బండి రాజు ముదిరాజ్ సంయుక్తంగా మాట్లాడుతూ మెపా అనేది విద్యా,ఉద్యోగ,సాధికారత కోసం స్థాపించమని,ఇందులో చేపలు పట్టే ప్రతి ముదిరాజ్ బిడ్డ,మరి ఏ ఇతర పనులు చేసే జాతి బిడ్డలు,యువత  అందరూ భాగస్వాములే అని తెలిపారు.అలాగే ముదిరాజ్ యువత,విద్యార్థుల సంక్షేమం కోసం మెపా ఎళ్ళవేళల పని చేస్తుందని,రాజ్యాధికారం కోసం జాతి బిడ్డలందరూ ఐక్యతతో పని చేయాలని, రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ముదిరాజ్'ల జెండా ప్రతి గ్రామంలో ఎగరాలని తెలియజేశారు. 
 రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ముదిరాజ్ లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు బండి రాజు ముదిరాజ్,మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు సాధు రఘు ముదిరాజ్,అబ్బాపూర్ మాజీ సర్పంచ్ గండి కూమార్ ముదిరాజ్,మెపా ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్,మెపా వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్,మెపా టీమ్ సభ్యులు కుక్కల కౌశిక్ ముదిరాజ్,శ్రావణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
-అధ్యక్షులుగా ఎర్ర రవీందర్,గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నగేష్  ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని తాటికాయల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జెండా గద్ద...
మహిళను వివస్త్రను చేసి,దాడి చేసిన ఘటనలో 25 మంది రిమాండ్
కెసిఆర్,హరీష్ సంతకాలే తెలంగాణకు మరణ శాసనం
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 
జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా