సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 

 వేద మంత్రోచ్చారణల మధ్య తొలి అక్షరాల దిద్దిన చిన్నారులు 

ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని రాయగుడెం గ్రామంలోని  సరస్వతీ దేవాలయంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, సంప్రదాయబద్ధంగా పిల్లలు అక్షరాల ప్రథమాంశాన్ని నేర్చుకున్న ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

నూతన విద్యాసంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ మహోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది సమిష్టిగా పాల్గొని పిల్లలకు శుభాశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,
“బాల్యంలోనే విద్యకు ఉన్న ప్రాధాన్యతను తెలిసేలా చేయాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. ఈ వయస్సులో విద్యారంభాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం చిన్నారుల్లో ఆసక్తిని పెంచుతుంది. బడులు తెరిచే రోజునే అక్షరభ్యాసం నిర్వహించడం అభినందనీయం,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ సింగ్, సీనియర్ ఉపాధ్యాయుడు పూల్ సింగ్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ప్రదిప, మహిళ సంఘ అధ్యక్షురాలు స్రవంతి, వి.ఓ చైర్మన్ రాజమ్మ, సీఆర్‌పి రనూప, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .