బాల సదనం నుండి అమెరికకు దత్తత

బాల సదనం నుండి అమెరికకు దత్తత

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

చట్టబద్దమైన దత్తత ప్రక్రియ శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆధ్వర్యంలో జరిగింది, సంబంధిత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ  శిశు గృహ, బాల సదనంలో ఆశ్రయం పొందుచున్న బాలిక (10)  వివరాలను కేంద్ర దత్తత వనరుల విభాగంకు ఆన్లైన్ చేయగా అమెరిక దేశానికి చెందిన దంపతులు అంతర్ రాష్ట్ర దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా దరఖాస్తును పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం సీనియారిటీ ప్రకారం గతంలో శిశు గృహ, బాలసదనంలో రక్షణ సంరక్షణ పొంది నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ కంట్రీ ఆడాప్షన్ అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతృత్వం ఒక వరమని అందుకు చట్ట బద్ధమైన దత్తత ప్రధాన మార్గమని, పిల్లలు లేని దంపతులు చట్ట బద్ధమైన దత్తతను తీసుకోవాలని అన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 మంది పిల్లలను ఇంటర్ కంట్రీ అడాప్షన్ లో భాగంగా ఇటలీ, మాల్టా, లండన్, అమెరిక దేశాలకు దత్తత ఇచ్చామని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సందసాని రాజేంద్ర ప్రసాద్, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సిహెచ్ అవంతి, బాల సదనం సూపరింటెండెంట్ ఎం కళ్యాణి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక, దత్తత కేంద్రం సోషల్ వర్కర్ సంగి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .