విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే

మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్య అందించాలి 

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే

-వరంగల్ ఎంపీ కడియం కావ్య

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ నిర్మాణం ఉందని, వారికి మార్గదర్శకులవలె ఉండాలనేది ప్రస్తుత కాలపు అవసరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. భీమారం వద్ద ఉన్న స్కిల్ స్టాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు ఎప్పుడూ నిత్యవిద్యార్థిగా ఉండాలని, నేర్చుకుంటూ బోధించే శైలి ద్వారా విద్యార్థుల్లో గుణాత్మకమైన మార్పు సాధించవచ్చని అన్నారు. సమాజ మార్పులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు.

విద్యార్థులకు మంచి విద్యతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు తగిన మార్గనిర్దేశం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని,అందులోని విషయాలను పాఠశాల స్థాయికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. WhatsApp Image 2025-05-24 at 9.13.14 PM (1)

ఈ కార్యక్రమంలో హన్మకొండ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా విద్యాధికారి వాసంతి, ఎసిపి సైదులు, కోఆర్డినేటర్లు శ్రీనివాస్, సుదర్శన్, డిస్టిక్ రిసోర్స్ పర్సన్లు, పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .