ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం

జహీరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
 
ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. రంజుల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు.భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్,రవీందర్ రెడ్డి,బాబు,మాజీ ఎంపిటిసి ఖలీల్,నాయకులు చంద్రన్న, గుండారెడ్డి,రాజు,మల్లేష్, రవి,శశి,షబ్బీర్,మస్తాన్,  సర్దార్,ఎల్లారెడ్డి,మల్లారెడ్డి, దత్తు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్,ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .