అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి మాదిగలకు దక్కిన గౌరవం  

హర్షం వ్యక్తం చేసిన రాజేష్ 

అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి మాదిగలకు దక్కిన గౌరవం  
తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్

-అడ్లూరికి మంత్రి పదవి మాదిగ జాతికి దక్కిన గౌరవం 

-మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తున్న సిఎంకు కృతజ్ఞతలు 

-తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్


హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో నూతన మంత్రివర్గ విస్తరణలో భాగంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల మాదిగ సంఘాలలో  ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాదిగ జాతికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ బొల్లెపాక రాజేష్ హర్షం వ్యక్తం చేశారు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ జాతి ముద్దుబిడ్డగా, ప్రజల మద్దతుతో అసెంబ్లీలోకి వచ్చి, ఇప్పుడు మంత్రి పదవిని అలంకరించడాన్ని మాదిగ సామాజిక రాజకీయ చైతన్యానికి విజయంగా అభివర్ణించారు. రాష్ట్రంలోని మెరుగైన మాదిగ ప్రతినిధిత్వానికి ఇది ప్రాతినిధ్యంగా నిలుస్తుందన్నారు. గతంలో నిర్ల్యక్షానికి  గురైన మాదిగ సామాజిక వర్గానికి ఈ నియామకం ద్వారా గౌరవం లభించిందని తెలిపారు.

ఈ సందర్భంగా రాజేష్  మాట్లాడుతూ, “అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మాదిగ జాతికి ఉన్నత గుర్తింపు. ఇది తర తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. మాదిగ సమాజంలో ఉన్న నైపుణ్యం, నైతికత, నాయకత్వ లక్షణాలకు ఇది నిదర్శనం,” అని పేర్కొన్నారు.

ఈ నిర్ణయం తీసుకుని మాదిగ సమాజాన్ని గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి మాదిగ వర్గానికి చెందిన ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ మంత్రి పదవిని ఇచ్చిన విధానం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మాదిగ వర్గానికి మరింత న్యాయం చేయాలని, ఉద్యోగాలు, విద్య, సంక్షేమ రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తాను తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాత్రమే కాదు, ఒక మాదిగ జర్నలిస్టుగా కూడా ఈ విజయాన్ని గర్వంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .