పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది

పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు చంద్రారెడ్డి

పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది

కూకట్ పల్లి,తెలంగాణ ముచ్చట్లు:

కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్లోని ఫిలడెల్ఫియా ప్రార్థన మందిరంలో పది రోజులపాటు వి.బి.ఎస్,సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన  ర్యాలీలో పాపిరెడ్డినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఊట్ల చంద్ర రెడ్డి పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, మంచి క్రమశిక్షణ,మంచి అలవాట్లు,దేవుని యందు భక్తి, తల్లిదండ్రులకు విధేయత,సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి విద్యార్థులుగా మంచి క్రమం నేర్చుకోవడానికి విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుందని పిల్లలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంఘకాపరి పాస్టర్ సల్మాన్, నాయకులు తెట్టెబావి ఆనంద్, సంఘపెద్దలు ఇజ్రాయిల్,రాజ్ కుమార్,బాలకృష్ణారెడ్డి, ప్రసంగి,ప్రేమయ్య,దయాకర్, కోర్ర్నేలు,కల్పన తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .