కోరుట్ల బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు బైరి విజయ్‌కు ఘన సన్మానం
కోరుట్ల, తెలంగాణ ముచ్చట్లు:
సామాన్యుల హక్కులకు బాసటగా నిలవాలన్న లక్ష్యంతో కోరుట్ల బార్ అసోసియేషన్ నూతన కమిటీని స్వేచ్ఛ సామాజిక సంస్థ తరఫున ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కస్తూరి రమేష్, కార్యదర్శి కొంపెల్లి సురేష్‌తోపాటు కార్యవర్గ సభ్యులకు శనివారం సి. ప్రభాకర్ గ్రంథాలయంలో సన్మాన సభ జరిగింది.
సభకు స్వేచ్ఛ సాహిత్య సామాజిక సంస్థ అధ్యక్షుడు రాస భూమయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ, “న్యాయవాదులు తమ వృత్తిపట్ల నమ్మకంతో, దేశ పౌరుల హక్కులను పరిరక్షించే క్రమంలో కోర్టుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు,” అని పేర్కొన్నారు. కోరుట్లలో నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నూతన కమిటీని కోరారు.
ప్రెస్ డే సందర్భంగా పాత్రికేయులు అల్లె రాము, సాంబారు మహేష్‌లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చెన్న విశ్వనాథం, వొటారికారి శ్రీనివాస్, బద్ది నర్సయ్య, కడకుంట్ల సదాశివ్, గొనె సదానందం, పషియెద్దిన్, నాగనిర్మల, రాసబత్తుల రాజశేఖర్, సంస్థనాయకులు రుద్ర నాగరాజు, రాస గౌతం, శ్యామ్ సుందర్, భూపెల్లి నగేష్, ముల్క ప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments