సాయిరాం నగర్‌లో రూ.64 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం
పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్
Views: 28
On
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు: చిలుకనగర్ డివిజన్‌లోని సాయిరాం నగర్ కాలనీలో రూ.64 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — ‘‘డివిజన్‌లో అన్ని కాలనీలు, బస్తీలకు అవసరమైన నూతన రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, టీఆర్‌ఎస్ నాయకులు కొకొండ జగన్ ముదిరాజ్, ఏదుల కొండల రెడ్డి, కొల్లూరి శ్యామ్, కాలనీవాసులు సుబ్బారావు, డాక్టర్ సురేష్ వర్మ, సత్యం తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments