చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రతి 10 నిమిషాలకు బస్సు సేవలు
Views: 2
On
చెంగిచెర్ల, తెలంగాణ ముచ్చట్లు:
చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరే రైలు ప్రయాణికుల రవాణా సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కె. కవిత తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 10 నిమిషాలకు బస్సు ఒకటి నడుస్తోందని పేర్కొన్నారు.
మణుగూరు, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజూ చెర్లపల్లికి చేరుతున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం వివిధ దిశలకు బస్సు సేవలు కొనసాగుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
•250సీ రూట్: చెర్లపల్లి – మల్లాపూర్ – హబ్సిగూడ – సికింద్రాబాద్, ప్రతి 10 నిమిషాలకు.
•71ఏ రూట్: చెర్లపల్లి – ఉప్పల్ – చార్మినార్, ఉదయం 5.20 నుండి రాత్రి 8.40 వరకు, ప్రతి 20 నిమిషాలకు.
•పటాన్ చెరువు బస్సు: చెర్లపల్లి నుండి ఉదయం 4.25 – రాత్రి 9.50 వరకు, ప్రతి 30 నిమిషాలకు. తిరుగు ప్రయాణం పటాన్ చెరువు నుండి ఉదయం 6.00 – సాయంత్రం 3.15 వరకు.
•18హెచ్ రూట్: చెర్లపల్లి – ఇసీఐఎల్ – సికింద్రాబాద్, ఉదయం 4.30 – సాయంత్రం 7.00 వరకు, ప్రతి 10 నిమిషాలకు.
•300 రూట్: చెర్లపల్లి – ఉప్పల్ – ఎల్బీనగర్ – మెహిదీపట్నం, ఉదయం 3.30 – సాయంత్రం 4.30 వరకు.
•113ఎఫ్ రూట్: చెర్లపల్లి – ఉప్పల్ – రామంతాపూర్ – హిమాయత్‌నగర్ – బోరబండ, ఉదయం 8.35 – రాత్రి 7.35 వరకు.
ప్రస్తుతం 139 బస్సులు సేవలందిస్తుండగా, ఇటీవల మరో 123 బస్సులను ప్రారంభించామని కవిత తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 May 2025 22:53:35
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
Comments