మహిళను వివస్త్రను చేసి,దాడి చేసిన ఘటనలో 25 మంది రిమాండ్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాటికాయల గ్రామ ఘటన
-రోజు,రోజుకి పెరుగుతున్న నిందితుల సంఖ్య
-మూడు కార్లు,రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ఇటీవల ఓ మహిళను వివస్త్రను చేసి,దాడి చేసిన సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విదితమే.ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 25మంది నింధితులను అరెస్ట్ చేసి, రిమాండ్ విధించారు. సంఘటనకు సంబంధించి చిక్కుడు నాగరాజు తండ్రి లక్ష్మీనరసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులుగా గుర్తించిన పలువురిని రిమాండ్‌కు పంపారు.
జూన్ 28న చిక్కుడు గంగ, ఉస్తమ్ రమేశ్, ఉస్తమ్ యకయ్య, ఉస్తమ్ స్వామి, ఉస్తమ్ వేణు, ఉస్తమ్ దేవమ్మ, ఉస్తమ్ రజిత, ఉస్తమ్ శ్రావణి, ఉస్తమ్ సంతోష్, ఉస్తమ్ స్వరూప, ఉస్తమ్ తిరుపతిని పోలీసులు రిమాండ్‌కు పంపించారు.
తర్వాతి రోజు జూన్ 29న నిందితురాలిగా ఉన్న రెడ్డబోయిన పార్వతమ్మను కూడా రిమాండ్‌కు తరలించారు.
జూలై 1న బొల్ల రాజు, చిక్కుడు దేవేందర్, ఎర్ర ప్రభాకర్, దూబల రాజయ్య, మామిడాల వెంకటేశ్వర్లు, పేసరు రాములు, చిక్కుడు సాంబరాజు, చిక్కుడు రాజ పోశాలు, ఉస్తమ్ పోశాలు, పేసరు రమేశ్, బత్తిని రాజేశ్ లను పోలీసులు అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 25 మందిని పోలీసులు రిమాండ్‌కు పంపించారు. దర్యాప్తులో భాగంగా 3 కార్లు, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సమాచారం.
Comments