జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని సన్మానించిన చిరంజీవి నాయక్
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బముగా పూల బొకే అందించి,శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.....“ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక ఫర్నీచర్, మెరుగైన తరగతి గది వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని త్వరగా తీర్చిదిద్దాలి. సరిపడని ఫర్నీచర్‌ను సమకూర్చి, తరగతి గదులను విస్తరించడం ద్వారా విద్యామానవ వనరుల సృజనాత్మక భావనకు నాంది పలకాలి.”
“ప్రైవేట్ పాఠశాలలు అనుమతిపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. అర్హతలేని ఉపాధ్యాయులతో ‘టెక్నో’, ‘డిజిటల్’, ‘స్పెషల్’ తరగతులు నిర్వహిస్తూ అధికంగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాల పరిధిలోనే పాఠ్యపుస్తకాలు, నోట్స్, యూనిఫార్మ్, బ్యాగ్‌ల విక్రయాన్ని నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలి.”
“ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని, గ్రామీణ–నగర ప్రాంతాలన్నింటిలో విద్యారంగ అభివృద్ధికి మానిటరింగ్ వ్యవస్థను బలపరిచుకోవాలని కోరుతున్నాను.”ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి గుగులోతు చంద్రభాను, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్టేక్‌హోల్డర్లు కలిసి విద్యా వ్యవస్థలో మెరుగుదలకు పూర్తి సహకారం అందించాలని అంగీకరించారు.
Comments