తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ జెండా గద్దె  నిర్మాణానికి భూమి పూజ

తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

-అధ్యక్షులుగా ఎర్ర రవీందర్,గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నగేష్ 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  
మండలంలోని తాటికాయల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జెండా గద్ద నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని గంగారపు శ్రీనివాస్ మాదిగ (ఎమ్మార్పీఎస్ & ఎంఎస్పీ మండల ఇంచార్జి), మండల అధ్యక్షుడు సోంపెల్లి అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్థాయిలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నాగేష్ మాదిగ, అధ్యక్షులుగా ఎర్ర రవీందర్ మాదిగను ఎంపిక చేశారు. అధికార ప్రతినిధిగా పట్ల రవి, ఉపాధ్యక్షులుగా ఎర్ర ప్రణయ్, పట్ల చరణ్, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర సంపత్, ప్రచార కార్యదర్శిగా ఎర్ర రాహుల్, కార్యదర్శిగా బొల్లెపాక ప్రవీణ్, సహాయ కార్యదర్శిగా బొల్లెపాక శ్యామ్, సలహాదారులుగా పట్ల ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు.


WhatsApp Image 2025-07-01 at 10.17.00 PMకమిటీ సభ్యులుగా ఎర్ర వెంకటస్వామి, ఎర్రయాదగిరి, నల్ల మొగిలి, పట్ల రాజమౌళి,పట్ల రాజయ్య, ఎర్ర చంద్రయ్య, ఎడ్ల వెంకటయ్య, ఎర్ర జనార్ధనులు, పట్ల రాజు, పట్ల వంశీ తదితరులు ఉన్నారు. కుల పెద్దలు, గ్రామ పెద్దలు, పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
-అధ్యక్షులుగా ఎర్ర రవీందర్,గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నగేష్  ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని తాటికాయల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జెండా గద్ద...
మహిళను వివస్త్రను చేసి,దాడి చేసిన ఘటనలో 25 మంది రిమాండ్
కెసిఆర్,హరీష్ సంతకాలే తెలంగాణకు మరణ శాసనం
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 
జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా