పరకాల మహిళా డెయిరీ, శిక్షణ కేంద్రాలపై సమీక్ష

ఎమ్మెల్యే రేవూరి నేతృత్వంలో అధికారులతో సమావేశం

పరకాల మహిళా డెయిరీ, శిక్షణ కేంద్రాలపై సమీక్ష

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

మహాజనసభ అనంతరం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, ప్రకృతి వ్యవసాయంపై చర్చ జరిగింది.

మహిళా డెయిరీ కోసం అవసరమైన మౌలిక వసతులు, పాల సేకరణ వ్యవస్థ, నిర్వహణ విధానాలపై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి-హబ్, వ్యవసాయ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు ఇచ్చారు. ఆరు మండలాల్లో పశువుల సంఖ్య, పాల ఉత్పత్తి సామర్థ్యం, పశు ఆహారం వంటి అంశాలపై సమీక్ష సాగింది.

దామెర మండలం ల్యాదెల్లలో మహిళా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని జూన్ నెలలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. శిక్షణ కేంద్రానికి అవసరమైన వనరులను సమకూర్చే బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .