దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది
సన్న బియ్యం పంపిణీతో 84 శాతం నిరుపేదలకు ఆకలి తీరుతోంది
-ధాన్యం పండించడంలో ఉమ్మడి రాష్ట్రంలోని రికార్డును అధిగమించాం
-రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
-భారీ స్థాయిలో భద్రకాళి చెరువు పునరుద్ధరణ,సుందరీకరణ పనులు
-రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటిపారుదల, పౌర సరఫరా శాఖలపై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సితక్కలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటిపారుదల శాఖ అభివృద్ధి పనుల పురోగతి, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. దేవాధుల ప్రాజెక్టును పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ ను కూడా సందర్శించడం జరిగిందన్నారు. భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులను, సుందరీకరణ పనులను భారీ స్థాయిలో చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటలను స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట తెలంగాణలో వానాకాలం, యాసంగిలో పంటలు పండిందన్నారు. రాష్ట్రంలో 2.80 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. రబీ, యాసంగి సీజన్లకు సంబంధించి సన్న ధాన్యానికి 500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ను అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. ఈ
రెండు సీజన్లలో తెలంగాణలో పండినంత ధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో పండలేదన్నారు. 80 నుంచి 84% జనాభా కు సన్న బియ్యంతో భోజనంతో కడుపునిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం తమదని అన్నారు. అధికారులు వేరిఫైచేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. చారిత్రక, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. 3 లక్షల మందికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎంత ఖర్చైనా సరే నిరుపేదలకు సన్న బియ్యం అన్నం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎఫ్సీఐకి ధాన్యం అమ్మే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ప్రభుత్వం సహాయంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ఐదు లక్షల ఎకరాలకు వచ్చే విధంగా సాగునీరు నిరంతర అందించేలా ముందుకెళుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పష్టమైన ప్రణాళికతో రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుటివరకు రెండున్నర లక్షల వరకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. దేవాదుల పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వము కృషి చేస్తుందన్నారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ కు తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నది జలాలను 40% పైగా నీటిని కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు చత్తీస్గడ్ ముఖ్యమంత్రితోను చర్చించినట్లు తెలిపారు. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సంవత్సరానికి 23 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించి పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖను అలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సూచించిన విధంగా సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు అంశంపై సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా ఇరిగేషన్ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను, ఆగివున్న పనులన్నింటిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి రైతన్నలకు సస్యశ్యామలంగా నిరందించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు అధికారులతో సమీకక్షించినట్లు తెలిపారు. వర్షాకాలంలో ఏవిధంగా ధాన్యం పండించారో అదేవిధంగా వేసవిలో కూడా ధాన్యం పంటలను పండించారన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైతుల అందించిన పండించిన ధాన్యాన్ని సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు.
భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు ప్రభుత్వం చిత్తశుద్ధి చేస్తుందన్నారు. భద్రకాళి పురాతన చెరువని, 50% పనులు పూర్తి అయ్యాయని అన్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఇది అధికారుల పనితీరు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. జంట నగరాలు అద్భుతమైన ట్యాంకు అని, బ్యాలెన్స్ వర్క్ ను షార్ట్ టెండర్లను పిలిచి పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో గిరిజన గ్రామాలు అధికంగా ఉన్న దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలో వాగులు ఉన్నందున చెక్ డ్యామ్ లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సాగునీటి కాలువల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా తమ తమ నియోజకవర్గాలలోని సాగునీటి కాలువలు, చెరువులు, వాగులు, సాగునీటికి ఇబ్బందులు, తదితర సమస్యలను మంత్రుల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, కె ఆర్ నాగరాజు, సత్యనారాయణ రావు, మురళి నాయక్ మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఉమ్మడి జిల్లాలోని సాగునీటిపారుదల శాఖకు సంబంధించి ఎమ్మెల్యేలు సూచించిన అంశాలపై ఈఎన్సీ అనిల్ కుమార్, అశోక్ కుమార్ వాటి పరిష్కారానికి తీసుకోనున్నట్లు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్ ప్రావీణ్య, సత్య శారద, అద్వైత్ కుమార్ సింగ్ , దివాకర్ టిఎస్, రిజ్వాన్ భాషా షేక్, రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్లు, సాగునీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
భద్రకాళి చెరువు పూడికతీతను పరిశీలించిన మంత్రులు.
రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పూడికతీత పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. పూడికతీత పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మాత్రులు ఆదేశించారు.
Comments