సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
రాష్ట్రసాగునీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు.
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట గ్రామ శివారులోని దేవాదుల పంప్ హౌస్ స్టేషన్ ను రాష్ట్ర సాగునీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణా సమాచార శాఖ మంత్రి పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,నాయని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి,కె ఆర్ నాగరాజు,మేయర్ గుండు సుధారాణి లతో కలిసి శనివారం రోజున పరిశీలించారు. అనంతరం దేవాదుల పంపు హౌస్ పనుల పురోగతి ఇతర అంశాలపై సాగునీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సాగునీరు,ధాన్యం కొనుగోలు ఇతర అంశాలపై సమీక్షించేందుకు జిల్లాకు వచ్చినట్లు తెలియజేశారు.దేవాదుల మూడు పైపులైన్ల పంపులను ఆన్ చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.దేవాదుల పంపు హౌస్ నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న దేవాదుల పైపులను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,సాగునీటి పారుదల శాఖ ఈన్సీ అనిల్ కుమార్,సి ఈ అశోక్ కుమార్,హనుమకొండ జిల్లా కలెక్టర్
Comments